

తెలుగు కళా సమితి, విశాఖపట్నం
మా గురించి (పరిచయం)
తెలుగు కళా సమితి, విశాఖపట్నం 2017 సంవత్సరంలో యెల్లు మహంతి సత్య కూర్మ నరసింహ స్వామి గారిచే స్థాపించబడింది. వీరు 19-08-1954న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, శృంగవరపుకోటలో జన్మించారు. వీరి తండ్రి యెల్లు మహంతి వెంకట రమణ గారు, తల్లి యెల్లు మహంతి సూర్యకాంతం గారు.
లక్ష్యాలు మరియు ఉద్దేశాలు
తెలుగు కళా సమితి, విశాఖపట్నం ఒక లాభాపేక్షలేని సంస్థగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి సంరక్షణ, సామాజిక బాధ్యత కలిగిన రచనలు ప్రోత్సహించడం మరియు సమాజ సేవలను అందించడం మా ప్రధాన లక్ష్యం.
తెలుగు రచనా నైపుణ్యాల అభివృద్ధి:
తెలుగు భాషలో రచనలను సంరక్షించడం మరియు అభివృద్ధి చేయడం.
రచయితలను ప్రోత్సహించడం:
కొత్త రచయితలకు అవకాశాలు కల్పించడం మరియు వారి ప్రతిభను ప్రోత్సహించడం.
సామాజిక బాధ్యత కలిగిన రచనల ప్రచారం:
సామాజిక మార్పుల కోసం సానుకూల నాటకాలు, నాటికలు ప్రోత్సహించడం.
తెలుగు సంస్కృతి పరిరక్షణ:
తెలుగు సాహిత్యం, నాటకాలు మరియు సంస్కృతిని రాబోయే తరాలకు అందించడం.
సమాజ సేవలో భాగస్వామ్యం:
సమాజ శ్రేయస్సుకు సేవలు అందించడం.
సహకారం మరియు సలహాలు:
ఇతర సంస్థలతో సహకరించి సమాజ అభివృద్ధికి దోహదం చేయడం.
శిక్షణ మరియు మార్గదర్శనం:
రచయితలకు శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించడం.
మా ఏకైక లక్ష్యం:
"తెలుగు కళా సమితి - విశాఖపట్నం" తెలుగు సాహిత్యం మరియు కళలను సంరక్షిస్తూ, సామాజిక చైతన్యం కలిగిన రచనల ద్వారా సమాజంలో సానుకూల ఆలోచనలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
"దేశ భాషలందు తెలుగు లెస్స"
అని శ్రీ కృష్ణ దేవరాయలు గారు చెప్పినట్లుగా... మన తెలుగు భాషలో ఎంతమంది అద్భుతమైన కవులు ఉన్నారు.
ఆ మహోన్నత కవులు మరియు కవయిత్రుల చిత్రాలు మీకోసం...


మా "తెలుగు కళా సమితి, విశాఖపట్నం" తరఫున మేము నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల గురించి మన జర్నలిస్ట్ మిత్రులు ఎన్నో పత్రికలలో ప్రచురించారు. వారికి మా హృదయ పూర్వక ధన్య వాదములు.


కార్యనిర్వాహక కమిటీ
వ్యవస్థాపక అధ్యక్షులు:
శ్రీ జి. త్రిమూర్తులు
అధ్యక్షులు:
శ్రీ. బొప్పె శ్రీనివాస్
ఉపాధ్యక్షులు:
శ్రీ. కె. ఎం. నాయుడు
కార్యదర్శి:
యెల్లు మహంతి సత్య కూర్మ నరసింహ స్వామి
జాయింట్ సెక్రటరీ:
శ్రీ. టాకాసి అప్పారావు
కోశాధికారి:
శ్రీ. వర్రే నాంచారయ్య
కార్యనిర్వాహక సభ్యులు:
శ్రీ. ఇ. రాంబాబు
కార్యనిర్వాహక సభ్యులు:
శ్రీ. పి. కన్నబాబు
కార్యనిర్వాహక సభ్యులు:
శ్రీ చేబ్రోలు సుబ్బారావు
కార్యనిర్వాహక సభ్యులు:
శ్రీమతి వై. జయశ్రీ



